KCR : ఇందిరమ్మ రాజ్యంలో జొన్నలే పండించుకోవాలన్నరు - కేసీఆర్
X
కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు చేసిందేమీలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తన హయాంలో పాలమూరును పట్టించుకోని ఆ పార్టీ వెనుకబడిన ప్రాంతమని, గరీబు ప్రాంతమని పేర్లు పెట్టారని మండిపడ్డారు. అలాంటి గరీబు ప్రాంతం ఇప్పుడు సస్యశ్యామలం ఎట్లైందని కోట్ల టన్నుల వడ్లు ఎట్ల పండుతున్నయని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లాపూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఇందిరమ్మ రాజ్యంలో మీరు జొన్నలే పండించుకోవాలని, వడ్లు పండవని అన్నారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో 3కోట్ల టన్నుల వడ్లు ఎలా పండుతున్నాయని ప్రశ్నించారు. కొల్లాపూర్‌లో 1.25 లక్షల ఎకరాల్లో వడ్లు పండుతన్నయని కేసీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ హయాంలో పక్కనే కృష్ణా నది ఉన్నా కొల్లాపూర్‌కు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ అన్న ఆయన.. ఇప్పుడు అదే పార్టీ నాయకుల సిగ్గూశరం లేకుండా ఓట్లు అడుగుతన్నారని విమర్శించారు. ఇందిరమ్మ వారసుడు రాహుల్ గాంధీ కొల్లాపూర్కు ఎందుకు వచ్చిండని ప్రశ్నించారు. మళ్లీ తెలంగాణను ఆగం పట్టించి ముళ్ల కిరీటం పెట్టడానికి వచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని ఓటర్లకు కేసీఆర్ సూచించారు.