51 మంది అభ్యర్థులకు మాత్రమే బీఫామ్స్ అందజేసిన కేసీఆర్..
X
తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశానిర్ధేశం చేశారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా మొదటగా 51 మంది అభ్యర్థులకు మాత్రమే బీ-ఫారాలు అందించారు సీఎం. మిగతావి రేపు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే టికెట్ దక్కని వాళ్లు తొందరపడి నిర్ణయాలే తీసుకోవద్దని.. ప్రతీ ఒక్కరికీ పార్టీలో అవకాశముంటుందని అన్నారు.
బీ-ఫారమ్ అందుకున్న వారిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, షకీల్, జాజాల సురేందర్, గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, పట్నం నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్, పువ్వాడ అజయ్, లింగాల కమల్ రాజ్, సండ్ర వెంకట వీరయ్య, వనమా వెంకటేశ్వర్ రావు, మెచ్చా నాగేశ్వర్ రావుతో పాటు పలువురు ఉన్నారు.
ఇక బీ-ఫారాలు నింపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని.. పొరపాటు చేయొద్దని కేసీఆర్ సూచించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా.. బీ-ఫారాలు నింపేటప్పుడు.. అప్డేట్ ఓటర్ జాబితాను అనుసరించాలన్నారు. గతంలో తమ పార్టీకి చెందిన నేతలు నివాస్ గౌడ్, వనమా వెంకటేశ్వర్ రావు, కృష్ణ మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టారని కేసీఆర్ గుర్తు చేశారు. గెలవలేక కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టారన్నారు.
ఎన్నికల్లో నిబంధనలు మారుస్తుంటారని.. ప్రతిది తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు. మాకు తెలుసులే అని అనుకోవద్దన్నారు. 98480 23175 నంబర్‌కు ఫోన్ చేస్తే భరత్ కుమార్ 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు. అభ్యర్థులకు సందేహాలు వస్తే ఒక్క ఫోన్ కొడితే నిమిషాల్లోనే పరిష్కారం చూపిస్తారన్నారు. ఇప్పట్నుంచే నామినేషన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. చివరి రోజున నామినేషన్లు వేసేందుకు ప్రయత్నించొద్దన్నారు. ఈ క్రమంలో ముందుగా ప్రకటించిన తొలి జాబితాలోని ఐదుగురి అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బీఫామ్ లు దక్కని వారిలో టెన్షన్ మొదలైంది.