CM KCR : ఈటల కంటే పెద్ద నాయకుడు కాసాని.. సీఎం కేసీఆర్
X
టిటీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఈ చేరికకు వేదికైంది. కాసానికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్ . అనంతరం మాట్లాడుతూ.. ఈటెల రాజేందర్ పోయినా… అంత కంటే పెద్ద నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఈటల రాజేందర్ ఎవ్వరిని ఎదగనివ్వలేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బండా ప్రకాశ్ ముదిరాజ్ లాంటి వాళ్లను పార్టీలోకి తీసుకొచ్చి పదవులు ఇచ్చామని, కాసాని జ్ఞానేశ్వర్‌కు అవకాశాలు ఉంటాయని కేసీఆర్ పేర్కొన్నారు.
ఎన్నికల తరువాత ముదిరాజ్ సామాజిక వర్గం నేతలం హైదరాబాద్ లో కుర్చుని మాట్లాడుకుందామన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గంకు రాజకీయంగా మంచి అవకాశాలు ఉంటాయన్నారు. ఎన్నికల తరువాత ముదిరాజ్ లతో సమావేశం అవుతా అన్నారు సీఎం కేసీఆర్. 119 సీట్లల్లో 112 మాత్రమే మన లెక్కలోకి వస్తాయ్ అన్నారు. తమాషాకి అభ్యర్థులను పెట్టద్దు… నిలబడితే గెలవాలని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఒక్కొక్క సీటు కౌంట్ అవుతుందన్నారు ఏదో తమాషాకు అభ్యర్థిని బరిలో దింపి, ఆ సీటును కోల్పోయి, పార్టీకి నష్టం చేకూర్చోవడం రాజకీయం కాదు అని అన్నారు. వృత్తి పరంగా ముదిరాజ్ లకు న్యాయం జరిగిందన్నారు
"ఎన్టీ రామారావు పీరియడ్‌లో లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసి సాధించాం. దాంతో కొంత మంది రాజకీయ నాయకులు ఎదిగారు. రాజకీయంగా రాబోయే రోజుల్లో చాలా పదవులు ఉంటాయి. చాలా అవకాశాలు ఉంటాయి. ముదిరాజ్ సామాజిక వర్గం పెద్దది కాబట్టి ఆ వర్గం నుంచి మనం నాయకులను తయారు చేసుకోవాలి. జిల్లాకు ఒకరిద్దరిని తయారు చేసుకుంటే పార్లమెంట్‌కు పెట్టుకోవచ్చు.. అసెంబ్లీకి పెట్టుకోవచ్చు. ఎమ్మెల్సీలు కూడా కావొచ్చు.. అలా చాలా అవకాశాలు ఉంటాయి" అని సీఎం కేసీఆర్ అన్నారు.