Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR : కాంగ్రెస్ 50ఏండ్లలో చేయలేనిది పదేండ్లలో చేసి చూపించాం - సీఎం కేసీఆర్

KCR : కాంగ్రెస్ 50ఏండ్లలో చేయలేనిది పదేండ్లలో చేసి చూపించాం - సీఎం కేసీఆర్

KCR : కాంగ్రెస్ 50ఏండ్లలో చేయలేనిది పదేండ్లలో చేసి చూపించాం - సీఎం కేసీఆర్
X

బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ప్రజల కోసమని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. 50 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని సూచించారు. కొత్తగూడెంలో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. ఒకప్పుడు కరెంటు, నీటి కోసం ఎన్నో బాధలు పడ్డామని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. కోతల్లేని కరెంటు, పుష్కలంగా తాగు, సాగునీరు అందుతోందని స్పష్టం చేశఆరు. కాంగ్రెస్ హయాంలో వృద్ధులకు రూ.40 నుంచి రూ.70 పెన్షన్ ఇచ్చేవారని, కానీ ఇప్పుడు రూ.2వేలు ఇస్తున్నామని చెప్పారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతోందని చెప్పారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వడంతో పాటు వారిపై ఉన్న కేసులు ఎత్తి వేశామని కేసీఆర్ గుర్తు చేశారు. కొత్తగూడెంలో దాదాపు 4,500 కుటుంబాలకు పోడు భూములు ఇవ్వడంతో పాటు రైతు బంధు, రైతు భీమా ఇస్తున్నామని స్పష్టం చేశారు. 50 ఏండ్లలో కాంగ్రెస్ చేయని పనిని బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో చేసి చూపిందని చెప్పారు.

సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు వచ్చిందని అది పూర్తైతే కరువన్న మాటే ఉండదని కేసీఆర్ అన్నారు. గత పాలకులెవరూ రైతులు, దళితులను పట్టించుకోలేదని విమర్శించారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు రైతు బంధు, దళిత బంధు పుట్టించిందే కేసీఆర్ అని చెప్పారు. పిడికెడు మందితో కలిసి రాష్ట్రమంతా తిరిగి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేశానని, ఉద్యమం ఉప్పెనలా మారితే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ గుర్తుచేశారు.




Updated : 5 Nov 2023 11:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top