Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR : కాంగ్రెస్ నేతల స్టేలతోనే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఆలస్యం : కేసీఆర్

KCR : కాంగ్రెస్ నేతల స్టేలతోనే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఆలస్యం : కేసీఆర్

KCR : కాంగ్రెస్ నేతల స్టేలతోనే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఆలస్యం : కేసీఆర్
X

కాంగ్రెస్ నేతల స్టేలతోనే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆలస్యమైందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడిప్పుడే కోర్టు చిక్కులు తొలగిపోయాయని.. కొద్ది రోజుల్లోనే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తవుతుందని తెలిపారు. దేవరకొండలో బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్రం రాకముందు తెలంగాణ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గమనించాలని సూచించారు. ప్రజలు ఓట్లేసేటప్పుడు అన్నీ ఆలోచించుకుని ఓటెయ్యాలని చెప్పారు. ఎన్నికల్లో ఒక వ్యక్తి కాదు ప్రజలు గెలవాలన్నారు.

దేవరకొండ నియోజకవర్గానికి పరిశ్రమలు రావాల్సిన అవసరముందని.. ఎన్నికల తర్వాత ఆ దిశగా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ గెలిచిన నెల రోజుల్లో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. పేదలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని.. వారి అభ్యున్నతికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుందని చెప్పారు.

రైతు బంధుతో ప్రభుత్వ నిధులను దుబారా చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని.. రైతులకు డబ్బులు ఇస్తూ దుబారానా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇక పీసీసీ చీఫ్ అయితే 3గంటల విద్యుత్ చాలని అంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ తీరుతో కర్నాటకలో రైతులు అరిగోస పడుతున్నారని.. కనీసం అక్కడ 5గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని చెప్పారు. పైగా అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 24గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణకు వచ్చి తమ రాష్ట్రంలో 5గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలంటే మరోసారి బీఆర్ఎస్ గెలిపించాలని కోరారు.


Updated : 31 Oct 2023 6:04 PM IST
Tags:    
Next Story
Share it
Top