TS Assembly Elections 2023 : ఆరు అడుగుల బుల్లెట్ హరీష్ నా మాట నిలబెట్టిండు -సీఎం కేసీఆర్
X
సిద్ధిపేట అభివృద్ధికి మంత్రి హరీష్ రావు చేసిన కృషి అమోఘమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆరు అడుగుల బుల్లెట్ హరీష్ పై నమ్మకంతో నియోజకవర్గాన్ని అప్పగిస్తే తాను ఊహించిన దానికన్నా ఎన్నో రేట్లు మెరుగ్గా పనిచేసి తన మాట నిలబెట్టాడని ప్రశంసించారు. హరీష్ తట్టెడు పెండ కనపడ్డా తీసుకెళ్లి సిద్ధిపేటలో వేసుకుంటడని ఎమ్మెల్యేలు జోక్ చేసుకుంటారంటే ఆయన పనితీరు అర్థం చేసుకోవచ్చని అన్నారు. హరీష్ రావు స్థానంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధిపేటను ఇంతగా అభివృద్ది చేయకపోయే వాడినేమోనని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
హరీష్ రావు హయాంలో సిద్ధిపేట అన్ని రంగాల్లో దూసుకుపోతోందని కేసీఆర్ అన్నారు. అసలు సిద్ధిపేటకు రానిదంటూ ఏమీ లేదని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమం, పథకం అన్నింటినీ సిద్దిపేటకు తీసుకురావడంలో ఎంతో కృషి చేశాడని చెప్పారు. రాష్ట్రంలో సిద్దిపేటకు ఒక ప్రత్యేకత.. గౌరవం ఉందన్న కేసీఆర్.. గత ఎన్నికలతో పోల్చితే ఈ సారి భారీ మెజారిటీతో హరీష్ రావును గెలిపించాలని ఓటర్లకు పిలువునిచ్చారు.