Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR : మళ్లీ అధికారమిస్తే నెల రోజుల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తం - సీఎం కేసీఆర్

KCR : మళ్లీ అధికారమిస్తే నెల రోజుల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తం - సీఎం కేసీఆర్

KCR : మళ్లీ అధికారమిస్తే నెల రోజుల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తం - సీఎం కేసీఆర్
X

తెలంగాణ ఉద్యమ సమయంలో జనగామ పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని (KCR) సీఎం కేసీఆర్ అన్నారు. జనగామలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. అప్పటి భయంకర పరిస్థితుల్ని గుర్తు చేసుకున్నారు. గోదావరి పక్కనే ఉన్నా బావులు, బోర్లలో నీళ్లు లేక యువకులంతా అన్నమో రామచంద్రా అని వలస పోయారని, కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయిందని అన్నారు. ఇప్పుడు జనగామ జిల్లా అద్భుతంగా అభివృద్ధి చెందిందని చెప్పారు.

సాగు నీళ్లు వచ్చిన తర్వాత పాత వరంగల్ జిల్లాలో అత్యధికంగా వడ్లు పండిస్తోందని ేసీఆర్ అన్నారు. ఒకప్పుడు ఎండిపోయిన బచ్చన్న పేట చెరువు 365 రోజులు నిండుకుండలా ఉంటోదని అన్నారు. జనగామ జిల్లా హైదరాబాద్కు సమీపంలో ఉన్నందున ఐటీ కారిడార్లు, ఇండస్ట్రీలతో భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ అధికారం కట్టబడితే నెలరోజుల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. జిల్లాలో నర్సింగ్, పారామెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టును కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాకే అంకితం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరానికి లింకైన మల్లన్న సాగర్ నెత్తి మీద కుండా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. మల్లన్న సాగర్ను టపాస్ పల్లి రిజర్వాయర్లు లింకు చేసి జనగామలో కరువన్నదే రాకుండా చేస్తామని హామీ ఇచ్చారు.




Updated : 16 Oct 2023 11:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top