Home > తెలంగాణ > Telangana Elections 2023 > భూపాల్ రెడ్డిని గెలిపిస్తే నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేస్తాం : కేసీఆర్

భూపాల్ రెడ్డిని గెలిపిస్తే నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేస్తాం : కేసీఆర్

భూపాల్ రెడ్డిని గెలిపిస్తే నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేస్తాం : కేసీఆర్
X

కాళేశ్వరంతో నారాయణ ఖేడ్ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. మల్లన్న సాగర్ కాలువ, బసవేశ్వర ప్రాజెక్టు పూర్తైతే ఖేడ్ నియోజకవర్గంలో లక్షా 80వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. ఈ సారి కూడా భూపాల్ రెడ్డిని గెలిపిస్తే నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సింగూరు ప్రాజెక్టు ఇకపై ఎండిపోదని.. దానిని కాళేశ్వరంతో లింక్ చేసినట్లు చెప్పారు.

తన నియోజకవర్గ అభివృద్ధి కోసం భూపాల్ రెడ్డి అద్భుతంగా పనిచేశారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఆయన నియోజకవర్గ సమస్యలు తప్పా.. సొంత పనుల కోసం ఎప్పుడూ తన వద్దకు రాలేదని చెప్పారు. నియోజకవర్గంలో 100 తండాలను పంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేశామన్నారు. మరోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్న సీఎం.. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆగం కాకుండా ఆలోచించి ఓటెయ్యాలని చెప్పారు.

క‌ర్నాట‌క‌లో కరెంటు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేసీఆర్ అన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న తెలంగాణకు వచ్చిన కర్నాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలు విని మోసపోకుండా అభివృద్ధి చేసే పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.


Updated : 30 Oct 2023 5:42 PM IST
Tags:    
Next Story
Share it
Top