Home > తెలంగాణ > Telangana Elections 2023 > TS Assembly Elections 2023 : అప్పులపాలైన నేతన్నల కన్నీరు తుడిచేందుకే బతుకమ్మ చీరలు - సీఎం కేసీఆర్

TS Assembly Elections 2023 : అప్పులపాలైన నేతన్నల కన్నీరు తుడిచేందుకే బతుకమ్మ చీరలు - సీఎం కేసీఆర్

TS Assembly Elections 2023 : అప్పులపాలైన నేతన్నల కన్నీరు తుడిచేందుకే బతుకమ్మ చీరలు - సీఎం కేసీఆర్
X

రాష్ట్రంలో కొందరు దుర్మార్గులు అన్నింటినీ రాజకీయం చేస్తున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరమగ్గాలు నడవాలి, నేత కార్మికులు బతకాలన్న లక్ష్యంతో బతకమ్మ చీరుల పథకం తీసుకొస్తే కొందరు దానిపైనా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకే బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా దాదాపు రూ.300 నుంచి 400 కోట్ల రూపాయలతో చేనేతలకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. అప్పులపాలైన చేనేతల కన్నీరు తుడిచేందుకు చేపట్టిన ఈ పథకంపైనా కొందరు రాజకీయం చేస్తూ చీరలు కాలబెట్టడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. చీరలు నచ్చకపోతే తీసుకోవద్దు అంతే తప్ప వాటి పంపిణీని రాజకీయం చేయొద్దని కోరారు.

తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం 3కోట్ల టన్నుల వడ్లు పండించి దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందని కేసీఆర్ అన్నారు. సిద్ధిపేట నుంచి సిరిసిల్లకు వచ్చే దారిలో ఎటు చూసినా పంటపొలాలే కనిపిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం ఇస్తామని హామీఇచ్చారు. సిరిసిల్లను మంచి విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఓట్ల కోసం మేనిఫెస్టోలో అబద్దాలు చెప్పలేదని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. కల్యాణ లక్ష్మి పథకాన్ని రూ. 50వేలతో ప్రారంభించి ఆ తర్వాత రూ.75వేలు ఆ తర్వాత లక్షా 16వేలకు పెంచామని గుర్తుచేశారు. ఆసరా పెన్షన్లను కూడా వెయ్యితో ప్రారంభించి ప్రస్తుతం రూ.2 వేలు ఇస్తున్నామని మళ్లీ గెలిస్తే విడతలవారీగా ఆ మొత్తాన్ని రూ.5వేలకు పెంచుతామని స్పష్టం చేశారు.




Updated : 17 Oct 2023 12:31 PM GMT
Tags:    
Next Story
Share it
Top