Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR : కాంగ్రెస్ వస్తే బంగాళాఖాతంలో కలిసేది ధరణి కాదు.. రైతులు : కేసీఆర్

KCR : కాంగ్రెస్ వస్తే బంగాళాఖాతంలో కలిసేది ధరణి కాదు.. రైతులు : కేసీఆర్

KCR  : కాంగ్రెస్ వస్తే బంగాళాఖాతంలో కలిసేది ధరణి కాదు.. రైతులు : కేసీఆర్
X

గత పదేళ్లుగా ఆర్థిక క్రమశిక్షణ పాటించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే మంచి జరుగుతుందో ఆలోచించి ప్రజలు ఓట్లు వేయాలని సూచించారు. బూర్గంపాడులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. మణుగూరుకు రావాల్సిన వీటీపీఎస్పై సమైక్యవాదులు కుట్ర జరిపి.. విజయవాడకు తీసుకెళ్లారని ఆరోపించారు. పినపాక నియోజకవర్గంలో 16వేల కుటుంబాలకు పోడు పట్టాలిచ్చామని చెప్పారు.

సీతారామ ప్రాజెక్ట్ పూర్తైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా బంగారు తునకగా మారుతుందని కేసీఆర్ అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ గురించి కాంగ్రెస్ ఆలోచించలేదని.. బీఆర్ఎస్ వచ్చాకే ప్రాజెక్టును ప్రారంభించామని చెప్పారు. పినపాక నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ దళిత బంధు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. ధరణి తీసేస్తే మళ్లీ పైరవీకారుల రాజ్యం వస్తుందన్నారు. కాంగ్రెస్ వస్తే బంగాళాఖాతంలో పడేది ధరణి కాదు.. రైతులు అని అన్నారు.

దేశంలోనే 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, ధాన్యం కొనుగోలుతో రైతులకు అండగా నిలిచామన్నారు. రైతు బంధు దుబారా అని ఉత్తమ్.. మూడు గంటల కరెంట్ చాలని రేవంత్ అనడం సిగ్గుచేటన్నారు. సంపద పెంచుతున్నాం.. ప్రజలకు పంచుతున్నామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ గడప తొక్కనియ్యమని విర్రవీగుతున్నారని.. వారి అహంకారానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


Updated : 13 Nov 2023 4:28 PM IST
Tags:    
Next Story
Share it
Top