Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR : బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే గజ్వేల్లో ఒకే విడతలో దళిత బంధు - కేసీఆర్

KCR : బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే గజ్వేల్లో ఒకే విడతలో దళిత బంధు - కేసీఆర్

KCR : బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే గజ్వేల్లో ఒకే విడతలో దళిత బంధు - కేసీఆర్
X

దశాబ్దాల పోరాటం తర్వాత సాధించిన రాష్ట్రాన్ని ఓ దరికి తెచ్చుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. అద్బుత రాష్ట్రంగా మారి పేదలు లేని తెలంగాణగా మారాలని ఆకాంక్షించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే గజ్వేల్లో ఒకే విడతలో దళిత బంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో తమ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూలగొట్టాలని సమైక్యవాదులు కుట్ర చేశారని కేసీఆర్ ఆరోపించారు.

విధివంచితుల కోసమే పింఛన్లు తీసుకొచ్చామన్న కేసీఆర్.. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే పెన్షన్ మొత్తాన్ని రూ.5వేలకు పెంచుతామని అన్నారు. రైతు బంధుతో అన్నదాతలను ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమేనన్న ఆయన.. 7,500 కొనుగోలుకేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. రైతులకు 24 గంటల విద్యుత్ కావాలంటే మళ్లీ బీఆర్ఎస్ రావాలని పిలుపునిచ్చారు.




Updated : 28 Nov 2023 4:45 PM IST
Tags:    
Next Story
Share it
Top