Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR : ఐదేళ్లకోసారి వచ్చే నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు : కేసీఆర్

KCR : ఐదేళ్లకోసారి వచ్చే నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు : కేసీఆర్

KCR : ఐదేళ్లకోసారి వచ్చే నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు : కేసీఆర్
X

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. ఓటు అనేది 5ఏళ్ల రాష్ట్ర భవిష్యత్ను నిర్ణయించేది అని.. దానిని బాగా ఆలోచించి వేయాలని వేయాలని సూచించారు. నర్సంపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. పాకాల ప్రాజెక్ట్తో యాసంగిలో లక్షా 35వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. పట్టుదలతో కృషి చేస్తేనే ఇది సాధ్యమైందని చెప్పారు.

గత పదేళ్ల నుంచి నర్సంపేట ప్రశాంతంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఐదేళ్లకోసారి వచ్చే నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్ హయాంలో మంచినీళ్లు, సాగునీళ్లకు ప్రజలు అరిగోస పడ్డారని అన్నారు. రైతు సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్ద పీట వేసిందని చెప్పారు. సాగునీరు, రైతు బంధు, రైతు బీమా, ధాన్యం కొనుగోలు వంటి వాటితో వారికి అండగా నిలిచామన్నారు. రైతు బంధును పుట్టిచ్చిందే కేసీఆర్ అని.. కానీ

దేశంలో 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ 24గంటల కరెంట్ లేదన్నారు. 50ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధి చేసిందేమి లేదని విమర్శించారు. అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. ధరణి తీసేస్తే మళ్లీ పైరవీకారుల రాజ్యం వస్తుందన్నారు. కాంగ్రెస్ వస్తే బంగాళాఖాతంలో పడేది ధరణి కాదు.. రైతులు అని అన్నారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే పెద్ది సుదర్శన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


Updated : 13 Nov 2023 6:01 PM IST
Tags:    
Next Story
Share it
Top