KCR : కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్
Kiran | 30 Oct 2023 9:15 PM IST
X
X
కత్తిపోటుకు గురై యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. నారాయణఖేడ్ ప్రజా ఆశీర్వాద సభ నుంచి ఆయన నేరుగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. ప్రభాకర్ రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు సీఎం కేసీఆర్‌కు వివరించారు.
మరోవైపు కొత్త ప్రభాకర్ రెడ్డికి సర్జరీ ముగిసింది. పేగుకు గాయం కావడంతో శస్త్రచికిత్స చేసినట్లు చెప్పారు. ఎలాంటి ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఆయనను ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. సర్జరీ చేస్తున్నప్పుడు గాయం తీవ్రంగా ఉందని గుర్తించినట్లు డాక్టర్లు చెప్పారు.
Updated : 30 Oct 2023 9:15 PM IST
Tags: telangana ts politics assembly elections kotha prabhakar reddy medak mp narayankhed praja ashirvada sabha yashoda hospital kcr visited yashoda hospital intestine infection surgery intensive care unit
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire