TS Assembly Elections 2023 :ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాకు కేసీఆర్.. మూడు సభల్లో..
X
సీఎం కేసీఆర్ ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. కేసీఆర్ మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 1.40 గంటలకు కోదాడ చేరుకుంటారు. 1.50 గంటలకు అక్కడి ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు. 2.30 గంటలకు కోదాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.10 గంటలకు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి చేరుకుంటారు.
సీఎం కేసీఆర్ తిరుమలగిరి బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత 3.50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.10 గంటలకు ఆలేరుకు చేరుకుంటారు. అక్కడ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్తారు. ఈ నెల 31న ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మరో మూడు నియోజకవర్గాల్లో సీఎం పర్యటిస్తారు. హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.