Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR : ఇండియా మ్యాప్, కారు సింబల్.. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్దం

KCR : ఇండియా మ్యాప్, కారు సింబల్.. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్దం

KCR : ఇండియా మ్యాప్, కారు సింబల్.. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్దం
X

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎన్నిక‌ల ప్రచార ర‌థం సిద్ధ‌మైంది. బీఆర్ఎస్ అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా ముస్తాబై ఎన్నికల ప్రచారానికి రెడీ అయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నజరానాగా అందించారు. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణాకు ఈ వాహ‌నం చేరుకుంది. ఆదివారం నుంచి నుంచి మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణా రోడ్లపై ప్ర‌చార ర‌థం పరుగులు పెట్టనుంది. ఇవాళ హుస్నాబాద్‌కు ప్రచార రథం చేరుకుంటుంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.





మరోవైపు సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లా.. హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న కెసీఆర్ సభకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ లు కలిసి సభా వేదికను పర్యవేక్షించారు. ప్రగతిభవన్ లో అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చిన వెంటనే.. కేసీఆర్ సెంటిమెంట్ గా నిర్వహించే హుస్నాబాద్ తొలి సభలో మొదటి ఎన్నికల ప్రసంగం చేయనున్న నేపథ్యంలో ఈ సభకు ప్రాధాన్యత సంతరించుకుంది.





ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ లు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. అలాగే హుస్నాబాద్ లో సైతం తనను ముచ్చటగా మూడోసారి ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పై సీఎం కెసిఆర్ పై నమ్మకంతో ఉన్నారని వెల్లడించారు. ఇక ఆదివారం తెలంగాణ భవన్ లో ఆవిష్కరించనున్న బీఆర్ఎస్ మేనిఫెస్టోపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రానున్న ఎన్నికల్లో ఓట్లను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించడం, ముఖ్యంగా రైతు రుణమాఫీ వంటి గత హామీలను పరిగణనలోకి తీసుకుని మేనిఫెస్టో రూపకల్పనలో కేసీఆర్ గణనీయమైన కృషి చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.









Updated : 15 Oct 2023 11:03 AM IST
Tags:    
Next Story
Share it
Top