CM Revanth Reddy : 24 గంటల కరెంట్పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
X
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి సమీక్షలు నిర్వహిస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. శుక్రవారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన రేవంత్.. ప్రజలకు 24 గంటల ఉచిత కరెంట్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం మారినా తెలంగాణలో కరెంట్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగొద్దని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి 24 గంటలూ కరెంట్ సరఫరా చేయాలని డిస్కం అధికారులను ఆదేశించారు. ఇందులో ఎక్కడా రాజీపడవద్దని.. ప్రతి ఇంటికీ నెలకు 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా సరఫరా చేసేందుకు కావాల్సిన మార్గదర్శకాలు తయారు చేయాలని సూచించారు. రాష్ట్ర విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియజేసేలా వారం రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేసేందుకు ఆయన కసరత్తు చేశారు.