Home > తెలంగాణ > Telangana Elections 2023 > CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శ

CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శ

CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శ
X

సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ను స్వయంగా పరామర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు యశోద ఆసుపత్రికి మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ .. కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరామర్శ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని, తెలంగాణ ప్రజల సమస్యలపై సభలో మాట్లాడాలని ఆశించారు. కేసీఆర్ ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. సీఎస్, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. త్వరగా కోలుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందిస్తామన్నారు.

ఇక పరామర్శ నేపథ్యంలో ఆదివారం హాస్పిటల్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఇక హిప్‌ రీప్లేస్‌మెంట్‌ ఆపరేషన్‌ అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కేసీఆర్‌. వాకర్‌ సాయంతో కేసీఆర్‌ను వైద్య బృందం నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. 8 వారాల్లో పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు తెలిపారు.

ఈ నెల 7 న గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేసీఆర్‌ ఎర్రవల్లి గ్రామంలోని తన ఫామ్‌హౌస్‌లో జారిపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తుంటికి గాయమైంది. హుటాహుటిన యశోదా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే.. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే సీఎం రేవంత్‌ రెడ్డి వివరాలు వివరాలు ఆరా తీసారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం తానే స్వయంగా యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ని పరామర్శించారు.




Updated : 10 Dec 2023 1:02 PM IST
Tags:    
Next Story
Share it
Top