Congress : మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్..
X
తెలంగాణ కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ ప్రకటిచింది. గురువారం (నవంబర్ 9) హైదరాబాద్ లోని సిటీ కన్వెన్షలో జరిగిన కార్యక్రమంలో.. సీడబ్ల్యూసీ సభ్యులు సల్మాన్ ఖుర్షీద్, ఇమ్రాన్ ప్రతాప్, నాసిర్ హుస్సేన్ చేతుల మీదుగా, టీపీసీసీ చీఫ్ ఆద్వర్యంలో మైనార్టీ డిక్లరేషన్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆక్రమణలకు గురైన వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, డిజిటలైజేషన్ చేస్తామని చెప్పారు. మైనార్టీల కోసం ప్రత్యేకంగా సబ్ ప్లాన్ ఏర్పాటుచేస్తామని, ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి కావాల్సిన రూ. 5 లక్షల నగదు సాయం చేస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఉర్దూ మీడియం టీచర్ల కోసం ప్రత్యేక డీఎస్సీ నిర్వహిస్తామని అన్నారు.
మైనార్టీల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ లో ఏడాదికి రూ.4వేల కోట్లు కేటాయించి. రూ. వెయ్యి కోట్ల రుణాలు ఇస్తామని అన్నారు. ఎంపిహెచ్ఎల్ పూర్తి చేసిన మైనార్టీలకు రూ.5లక్షల అర్థిక సాయం, ముస్లీం, క్రిస్టియన్ స్మశాన వాటికల కోసం భూమి కేటాయిస్తామని చెప్పారు. కొత్తగా పెళ్లైన జంటలకు రూ.లక్ష 60వేల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.