Tummala Nageswara Rao : నేను డాలర్.. నువ్వు రద్దైన రూ.2 వేల నోటు.. తుమ్మల
X
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావు(tummala nageshwar) కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్(puvvada ajay) తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. తాను చెల్లని రూపాయిని కాదని డాలర్ అని అన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుతానని, డాలర్‌కి ప్రపంచంలో ఏ దేశంలోనైనా విలువ ఉందని చెప్పారు. పువ్వాడ రద్దైన రెండు వేల నోటు అని విమర్శించారు. ‘‘నేను చెల్లని రూపాయి కాదు డాలర్.....ఎక్కడైనా చెల్లుతా. డాలర్ కి ప్రపంచంలో ఏ దేశంలోనైనా విలువ. నీవు రద్దైన రెండు వేల నోటు.. నీ విలువ అది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడైనా పోటీ చేస్తానని.. ఖమ్మంలో పువ్వాడపై గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో భూ కబ్జాలు, అక్రమ కేసులు పెట్టించడం చేయలేదన్నారు. ఖమ్మంలో పువ్వాడపై గెలుపు తనదేనని తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. ప్రముఖ డాక్టర్ల భూములను పువ్వాడ కబ్జా చేశారని ఆరోపించారు. వారంతా తన దగ్గరకి వచ్చి వారి ఆవేధనను వ్యక్తం చేశారని అన్నారు. రఘునాథపాలెం మండలంలో లంబాడ సోదరుల భూములు, గుట్టలు కబ్జా చేశారని అన్నారు. అరాచకం లేని ఖమ్మం కోసం, ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తుమ్మల నాగేశ్వర్ రావు ధీమా వ్యక్తం చేశారు.