Home > తెలంగాణ > Telangana Elections 2023 > TS Assembly Elections 2023 : కాంగ్రెస్ - కమ్యూనిస్టుల మధ్య తేలని సీట్ల పంపకం వ్యవహారం

TS Assembly Elections 2023 : కాంగ్రెస్ - కమ్యూనిస్టుల మధ్య తేలని సీట్ల పంపకం వ్యవహారం

TS Assembly Elections 2023 : కాంగ్రెస్ - కమ్యూనిస్టుల మధ్య తేలని సీట్ల పంపకం వ్యవహారం
X

రాష్ట్రంలో కాంగ్రెస్ - కమ్యూనిస్టుల సీట్ల పంచాయితీ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన కాంగ్రెస్ ఒకట్రెండు రోజుల్లో రెండో జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందని ప్రకటించిన హస్తం పార్టీ.. వారికి సీట్ల కేటాయింపు విషయంలో మాత్రం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు

పొత్తులో భాగంగా చెరో ఐదేసి సీట్లు ఇవ్వాలని సీపీఐ, సీపీఎంలు కోరుతుండగా.. కాంగ్రెస్ మాత్రం రెండేసి సీట్ల చొప్పున ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వాటిలోనూ ఒక్కోటి సీపీఎం, సీపీఐ కోరుకున్న సీటు మరొకటి వేరే చోట ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రతిపాదనను కామ్రేడ్స్ అంగీకరించడం లేదని వార్తలు వస్తున్నారు. పార్టీల మధ్య పొత్తులపై చర్చ ఢిల్లీ స్థాయిలోనే నడుస్తోంది. అయితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీపీఎం, సీపీఐ నేతలతో చర్చలు జరిపి.. చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు ప్రతిపాదన పెట్టారన్న టాక్ వినిపిస్తోంది.

సీపీఐ కోరుకున్న ఐదు స్థానాల్లో మునుగోడు లేదంటే కొత్తగూడెంలలో ఏదో ఒకటి ఇస్తామని కాంగ్రెస్ చెప్పగా.. చివరికి కొత్తగూడెంకు సీపీఐ ఓకే చెప్పినట్లు సమాచారం. మరోవైపు చెన్నూరు టికెట్ను సీపీఐకు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రతిపాదించింది. అయితే ఆ పార్టీ మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ సీటు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇక సీపీఎం కోరుకున్న ఐదు సీట్లలో మిర్యాలగూడ సీటు ఇచ్చేందుకు హస్తం పార్టీ ఓకే చెప్పినట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తప్పనిసరిగా ఓ సీటు ఇవ్వాలని సీపీఎం పట్టుబడుతుండగా.. కాంగ్రెస్ ఇప్పటికే భద్రాచలం, మధిర అభ్యర్థుల్ని ప్రకటించింది. ఈ క్రమంలో పాలేరు సీటును సీపీఎంకు ఇచ్చే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.




Updated : 19 Oct 2023 11:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top