Komatireddy Raj Gopal Reddy : బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే - రాజగోపాల్
X
తెలంగాణ వచ్చినా మన తలరాతలు మారలేదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని అభిప్రాయపడ్డారు. నల్గొండ జిల్లా గట్టుప్పల మండలం వెల్మకన్నె గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలలు, దవాఖానాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు.
తన రాజీనామా దెబ్బకు కొత్త ఆసరా పింఛన్లు మంజూరయ్యాయని రాజగోపాల్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను అభివృద్ధి చేస్తామని, తమ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలతో ప్రజల జీవితాలు మారుస్తామని హామీ ఇచ్చారు. పేదలు, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలకు సాయం చేసే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తిని గెలిపించాలని రాజగోపాల్ పిలుపునిచ్చారు.