Mohammed Ali Shabbir : కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై షబ్బీర్ అలీ క్లారిటీ..
X
తెలంగాణ కాంగ్రెస్లో సీఎం అభ్యర్థి అంశం హాట్ టాపిక్గా మారింది. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, జానారెడ్డి వంటి నేతలు సీఎం రేసులో ఉన్నారు. ఇక తమ నాయకుడే సీఎం అంటూ ఆయా నేతల అనుచరులు చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. అటు బీఆర్ఎస్ సైతం కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై సెటైర్లు వేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6నెలలకు ఓ సీఎం అంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై షబ్బీర్ అలీ క్లారిటీ ఇచ్చారు. కామారెడ్డి నియోజకవర్గంలోని రెడ్డిపేటలో కాంగ్రెస్ చేపట్టిన రోడ్ షోలో రేవంత్ రెడ్డితో పాటు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే.. తెలంగాణకు కాబోయే సీఎం అని షబ్బీర్ అలీ అన్నారు. కేసీఆర్ అవినీతిని అడ్డుకునేందుకే రేవంత్ కామారెడ్డి నుంచి పోటీలో ఉన్నారని చెప్పారు. కామారెడ్డిని దోచుకునేందుకు కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని.. ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలంటే రేవంత్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గాన్ని వదిలేసి తాను ఎక్కడికి పోలేదని.. ఇక్కడి ప్రజల్లో గుండెల్లో ఉన్నానని అన్నారు.