Uttam Kumar Reddy : ఎమ్మెల్యే సైదిరెడ్డి 400 ఎకరాలు కబ్జా చేశాడు : ఉత్తమ్
X
హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి నాలుగేళ్లలో 400 ఎకరాలు కబ్జా చేశాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సైదిరెడ్డి మరోసారి గెలిస్తే పట్టా భూములు కూడా వదలడన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్.. 70 నుంచి 75 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి, దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయారని.. వారంతా కాంగ్రెస్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
సైదిరెడ్డి నియోజకవర్గంలోని మద్యం దుకాణాల నుంచి 4 లక్షల చొప్పున ట్యాక్స్ వసూల్ చేశారని ఉత్తమ్ ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజలపై తప్పుడు కేసులు పెట్టించారని అయ్యారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టును విమర్శించే హక్కు కాంగ్రెస్కు లేదన్నారు. సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా 24లక్షల ఎకరాలు సాగవుతుందని చెప్పారు. కాళేశ్వరంతో లక్ష కోట్లు దోచుకున్న చరిత్ర కేసీఆర్ది అని విమర్శించారు. 69వేల కోట్లు తెలంగాణ అప్పును 4లక్షల కోట్లకు చేర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.