Home > తెలంగాణ > Telangana Elections 2023 > Congress First list : కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Congress First list : కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Congress First list  : కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
X

(Congress Lirst list) తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగానికి పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్‌. తొలి విడతలో భాగంగా నేడు 55 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో మైనంపల్లి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాల్లో రెండేసి చొప్పున సీట్లు దక్కాయి. మిగతా స్థానాలపై చర్చించి బుధ, గురువారాల్లో రెండో జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఖమ్మం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మొదటి జాబితాలో వీరి పేర్లు లేకపోవడం గమనార్హం.





మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు దక్కాయి. సిట్టింగ్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ హుజూర్‌ నగర్‌ నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన సతీమణి పద్మావతి రెడ్డికి కోదాడ టికెట్‌ కేటాయించారు. కొడంగల్‌ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేయనున్నారు. పొత్తుల్లో భాగంగా వామపక్షాలు భద్రాచలం టికెట్‌ను డిమాండ్‌ చేసినప్పటికీ.. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకే మళ్లీ ఆ స్థానం కేటాయించారు.

కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా

1. బెల్లంపల్లి(SC) : గడ్డం వినోద్‌కుమార్‌

2. మంచిర్యాల : కొక్కిరాల ప్రేమ్‌ సాగర్‌రావు

3. నిర్మల్‌ : కూచాడి శ్రీహరిరావు

4. ఆర్మూర్: ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి

5. బోధన్‌ : సుదర్శన్‌రెడ్డి

6. బాల్కొండ : సునీల్‌ రెడ్డి

7.జగిత్యాల : జీవన్‌రెడ్డి

8. ధర్మపురి(SC): అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

9. రామగుండం: రాజ్

10. మంథని : శ్రీధర్‌బాబు

11. పెద్దపల్లి : విజయ రమణారావు

12. . వేములవాడ : ఆది శ్రీనివాస్‌

13. మానకొండూరు : కవ్వంపల్లి సత్యనారాయణ

14. మెదక్‌ : మైనంపల్లి రోహిత్‌రావు

15. అందోల్‌ (SC): దామోదర్ రాజనర్సింహ

16.జహీరాబాద్‌ : ఎ.చంద్రశేఖర్‌

17. సంగారెడ్డి : జగ్గారెడ్డి

18. గజ్వేల్‌ : నర్సారెడ్డి

19. మేడ్చల్: తోటకూర వజ్రేశ్ యాదవ్

20.మల్కాజిగిరి: మైనంపల్లి హన్మంతరావు

21. కుత్బుల్లాపూర్: కొలాన్ హన్మంతరెడ్డి

22. ఉప్పల్: ఎం. పరమేశ్వర్ రెడ్డి

23. చేవేళ్ల(SC): పమేన భీంభరత్

24. పరిగి : రామ్మోహన్‌రెడ్డి

25.వికారాబాద్‌ : గడ్డం ప్రసాద్‌కుమార్‌

26. ముషీరాబాద్: మందడి అంజనీకుమార్ యాదవ్

27. మలక్ పేట్: షేక్ అక్బర్

28. సనత్ నగర్: కోటా నీలిమ

29. నాంపల్లి: మహమ్మద్ ఫిరోజ్ ఖాన్

30. కర్వాన్: ఉస్మాన్ బిన్ మహ్మద్ అలీ అజ్రీ

31. గోషామహల్: మొగిలి సునీత

32. చంద్రాయాన్ గుట్ట: బోయ నగేష్

33. యాకత్‌పుర: కె. రవిరాజు

34. బహదూర్‌పుర: రాజేశ్ కుమార్ పులిపాటి

35. సికింద్రాబాద్: ఆదం సంతోష్ కుమార్

36. కొడంగల్‌ : రేవంత్‌రెడ్డి

37. గద్వాల్‌ : సరితా తిరుపతయ్య

38. అలంపూర్‌ : సంపత్‌కుమార్‌

39.నాగర్‌ కర్నూల్‌ : కూచకుళ్ల రాజేష్ రెడ్డి

40. అచ్చంపేట : వంశీకృష్ణ

41. కల్వకుర్తి : కసిరెడ్డి నారాయణరెడ్డి

42. షాద్‌నగర్‌ : కె. శంకరయ్య

43. కొల్లాపూర్ : జూపల్లి కృష్ణారావు

44. నాగార్జున సాగర్‌ : జయవీర్ కుందూర్

45.హుజూర్‌నగర్‌ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

46. కోదాడ : పద్మావతీరెడ్డి

47.నల్లగొండ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

48. నకిరేకల్‌ : వేముల వీరేశం

49. ఆలేరు : బీర్ల ఐలయ్య.

50. స్టేషన్ ఘన్‌పూర్: సింగపురం ఇందిర

51. నర్సంపేట: దొంతి మాధవరెడ్డి

52. భూపాలపల్లి: గండ్ర సత్యనారాయణ

53.ములుగు : సీతక్క

54. మధిర : భట్టివిక్రమార్క

55. భద్రాచలం : పొదెం వీరయ్య

Updated : 15 Oct 2023 4:27 AM GMT
Tags:    
Next Story
Share it
Top