Home > తెలంగాణ > Telangana Elections 2023 > Komatireddy Venkat Reddy :సీఎం కేసీఆర్ కు పాలించే అర్హత లేదు - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy :సీఎం కేసీఆర్ కు పాలించే అర్హత లేదు - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy  :సీఎం కేసీఆర్ కు పాలించే అర్హత లేదు - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టిస్తుందని నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన ఆయన.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ కలిసి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కలిసి పని చేస్తున్నారని వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు.

రాష్ట్రాన్ని దోచుకున్న సీఎం కేసీఆర్‌కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని వెంకట్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.




Updated : 5 Nov 2023 11:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top