Home > తెలంగాణ > Telangana Elections 2023 > TS Assembly : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి ఏమన్నారంటే..?

TS Assembly : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి ఏమన్నారంటే..?

TS Assembly : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి ఏమన్నారంటే..?
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు.. మెదక్‌ జిల్లా రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాస్‌రెడ్డి, వికారాబాద్‌ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతికి సభలో స్పీకర్‌ సంతాపం తెలిపారు. రెండు నిముషాల పాటు మౌనం పాటించిన అనంతరం.. సభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జరుగుతోంది. ముందుగా తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ఆకాంక్షలు కలలుగానే మిగిలిపోయాయి

ఎన్నో ఆశలు ఆకాంక్షల మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ కలలన్నీ గత ప్రభుత్వంలో హయాంలో కల్లలుగానే మిగిలిపోయాయన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణ అప్పుల పాలయిందని, ఇటువంటి పరిస్థితి రావడం తెలంగాణ ప్రజలకు దురదృష్టకరమన్నారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి సహేతుకమైన తీర్పునిచ్చారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. దశాబ్ధకాలంగా జరిగిన ఆర్థిక ఆరాచకాలు ప్రజలకు తెలియాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సంపూర్ణంగా అవగాహన చేసుకొని శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని చెప్పారు.

ఇదిలా ఉండగా.,... తెలంగాణ రాష్ట్ర ఆస్తుల వివరాలతో భారత రాష్ట్ర సమితి బుధవారం డాక్యుమెంటరీని విడుదల చేసింది. కేసీఆర్ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను రిలీజ్ చేసింది. ప్రభుత్వం చేస్తున్న అప్పుల ప్రచారాన్ని తిప్పికొట్టేలా బిఆర్ఎస్ ప్లాన్ రెడీ చేస్తోంది.




Updated : 20 Dec 2023 11:33 AM IST
Tags:    
Next Story
Share it
Top