Home > తెలంగాణ > Telangana Elections 2023 > White Paper : 42 పేజీల శ్వేతపత్రం.. ఇదే మొదటి అడుగు: డిప్యూటీ సీఎం

White Paper : 42 పేజీల శ్వేతపత్రం.. ఇదే మొదటి అడుగు: డిప్యూటీ సీఎం

White Paper : 42 పేజీల శ్వేతపత్రం.. ఇదే మొదటి అడుగు: డిప్యూటీ సీఎం
X

నాలుగు రోజుల విరామం తర్వాత ఇవాళ శాసనసభలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంలో ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తామని భట్టి విక్రమార్క అన్నారు. సవాళ్లు అధిగమించే దిశలో శ్వేతపత్రం మొదటి అడుగు వేసిందని తెలిపారు.

శ్వేతపత్రంలో ఉన్న అంశాలు

రాష్ట్ర మొత్తం అప్పులు ₹6,71,757 కోట్లు.

2014-15 నాటికి రాష్ట్ర రుణం ₹72,658 కోట్లు.

2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం పెరిగిన అప్పు.

2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం ₹3,89,673 కోట్లు.

2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం.

2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతం.

బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం.

57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి ₹4.98 లక్షల కోట్ల వ్యయం.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం.

రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం

రోజూ వేస్‌ అండ్‌ మీన్స్‌పై ఆధారపడాల్సిన దుస్థితి

2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, 2023లో అప్పుల్లో కూరుకుపోయింది.




Updated : 20 Dec 2023 12:22 PM IST
Tags:    
Next Story
Share it
Top