Home > తెలంగాణ > Telangana Elections 2023 > DK Aruna : బావ, బావమరుదుల్లో.. సీఎం కావాలనే ఆరాటం ఎక్కువుంది: డీకే అరుణ

DK Aruna : బావ, బావమరుదుల్లో.. సీఎం కావాలనే ఆరాటం ఎక్కువుంది: డీకే అరుణ

DK Aruna  : బావ, బావమరుదుల్లో.. సీఎం కావాలనే ఆరాటం ఎక్కువుంది: డీకే అరుణ
X

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. చీకోటి ప్రవీణ్ ను పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన డీకే అరుణ.. కేటీఆర్, హరీష్ రావు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనారోగ్యంగా ఉన్న కేసీఆర్ ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. బావ, బావమరుదిలిద్దరు ఆదరాబాదరాగా పనులు మొదలుపెట్టి, తెల్లసున్నాలేసి వెళ్లిపోతున్నారని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావులకు.. కేసీఆర్ ఆరోగ్యం కంటే సీఎం పదవి మీదే ఎక్కువ దృష్టి ఉందని ఆరోపించారు. సీఎం కావాలనే ఆరాటంలో ఆదరాబాదరాగా మీటింగ్స్ పెట్టి, ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గతకొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై తనకు పలు అనుమానాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలు దగ్గర పడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ జిమ్మిక్కులు మొదలుపెట్టిందన్నారు. మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయొద్దని బీఆర్ఎస్ పార్టీని కోరారు. ఇన్నేళ్లలో ఎన్నడూ గృహలక్ష్మి పథకం ప్రస్తావన తీయని బీఆర్ఎస్.. ఎన్నికల వచ్చినప్పుడే గుర్తుకు వచ్చిదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఏమాత్రం ఆందోళన లేకుండా.. సీఎం పదవికోసం చూస్తున్నారని మండిపడ్డారు. ఒక్కసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని, బీఆర్ఎస్, కాంగ్రెస్ హయాంలో చేయలేని అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలను కోరారు.




Updated : 7 Oct 2023 4:45 PM IST
Tags:    
Next Story
Share it
Top