Raghunandan Rao : కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి.. రఘునందన్ రావు ఏమన్నారంటే..?
X
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దాడిపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ఈ దాడికి తానకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తానే ఈ దాడి చేయించినట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఒక వేళ తప్పు చేసింది తమ పార్టీ కార్యకర్తలైతే తానే పోలీసులకు అప్పగిస్తానని స్పష్టం చేశారు.
నిందితుడు ఏ పార్టీ వ్యక్తి అనేది సీపీ శ్వేత స్పష్టంగా చెప్పి ఉంటే బాగుండేదని రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. నిందితుడి ఫేస్ బుక్ పేజీలో కాంగ్రెస్ పార్టీ ఫొటోలు ఉన్నాయని అన్నారు. మరోవైపు దళితబంధు రాలేదని ఆవేదనతోనే దాడి చేశాడని మీడియాలో వార్తలొచ్చాయని.. పోలీసుల విచారణలో నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు. దాడి తర్వాత బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని.. పోలీసులు వెంటనే వారిని విడిపిపెట్టాలని డిమాండ్ చేశారు.