Telangana Elections: ఈసీ కీలక నిర్ణయం.. టీఆర్ఎస్ పార్టీకి గ్యాస్ సిలిండర్ గుర్తు కేటాయింపు
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తు క్రమంలో ఈసీ పనులను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్) పార్టీకి ఈసీ.. గ్యాస్ సిలిండర్ గుర్తును కేటాయించింది. కరీంనగర్, మెదక్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఉద్యమకారులు కలిసి.. పొన్నాలకు చెందిన తుపాకుల బాలరంగంతో ఈ పార్టీని రిజిస్టర్ చేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేస్తామని ఈసీకి ఈ పార్టీ దరఖాస్తు చేసింది. ఈ పార్టీ విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీ.. కొన్ని షరతులతో కూడిన ఉత్తర్వులను జారీ చేసింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులందరికీ గ్యాస్ సిలిండర్ ను ఎంపిక చేసింది. ఎలక్షణ కమిషన్ నియమావలి ప్రకారం.. ఎన్నికల్లో నిలబడే పార్టీ కనీసం 50 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆ పార్టీకి కేటాయించిన గుర్తును వేరే పార్టీకి కేటాయిస్తారు.
ఎవరీ తుపాకుల బాలరంగం?
తుపాకుల బాలరంగంది సిద్దిపేట జిల్లా పొన్నాల. ఆయన 1983 నుంచి సీఎం కేసీఆర్ తో కలిసి రాజకీయాల్లో పనిచేశారు. 1987, 1995లో పొన్నాల గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. తర్వాత 2001లో సిద్దిపేట మండల అప్పటి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2006లో సిద్దిపేట మండల జెడ్పీటీసీగా, 2019 నుంచి 2021 వరకు ఉపాధి హామీ పథక రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా సేవలందించారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి.. రాష్ట్ర ఉద్యమకారులందరితో కలిసి పార్టీని పెట్టారు.