EC టైం చూసి దెబ్బకొట్టింది.. జనసేనకు దక్కని గాజు గ్లాస్
X
బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన వేళ జనసేన పార్టీకీ భారీ షాక్ తగిలింది. బరిలోకి దిగే ముందు ఈసీ ఆ పార్టీకి గాజు గ్లాసును కేటాయించలేదు. గాజు గ్లాసును రిజర్వ్ పెట్టడంతో జనసేన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టికెట్లు ఖరారైన అభ్యర్థులు ప్రచారం చేస్తు.. తమ పార్టీ సింబల్ ను గాజు గ్లాస్ గానే ప్రజలకు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో ఈసీ గాజు గ్లాస్ ను రిజర్వ్ లో పెట్టడం పార్టీని నష్టం కలిగించే విషయమే. కాగా బీజేపీతో పొత్తుపెట్టుకున్న జనసేన 8 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగుతుంది. పార్టీలోని బలమైన నాయకులను బరిలోకి దింపింది పార్టీ.
ఈ క్రమంలో సింబల్ మార్ను సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో జనసేనకు పెద్దగా గుర్తింపు లేకపోవడంతోనే సింబల్ ప్రాబ్లమ్ వచ్చిందని అంటున్నారు. తెలంగాణలో జనసేన కేవలం రిజిస్టర్డ్ పార్టీనే. రికగ్నైజ్డ్ పార్టీ కావాలంటే గత ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు.. పోలైన ఓట్లలో నిర్ణీత శాతం ఓట్లు పొందాల్సి ఉంటుంది. కాగా నింబంధనలకు దగిన ఓట్ల శాతం పొందని కారణంగా జనసేనకు గాజు గ్లాస్ గుర్తు దక్కలేదు. అ క్రమంలో గుర్తు లభించని అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణంలోకి తీసుకుంటారని చర్చ జరుగుతోంది. అదే జరిగితే జనసేన అభ్యర్థులకు ఒక్కో వ్యక్తికి ఒక్కో గుర్తును కేటాయిస్తారా లేదా 8 మందికి కలిసి ఒకే గుర్తు కోరుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.