ఎగ్జిట్ పోల్స్పై ఎలక్షన్ కమిషన్ కీలక ప్రకటన
X
5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే మరో 4 రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘఢ్, మిజోరం రాష్ట్రాల్లోనూ ఈ ఆదేశాలు అమల్లోకి ఉంటాయని చెప్పింది.
నవంబర్ 7 ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం 6.30గంటల వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం కొనసాగుతుందని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల చట్టంలోని సబ్ సెక్షన్ 2 ప్రకారం ఈ ఆంక్షలు ఉంటాయని చెప్పింది. ఈ సమయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్, ఇతర మాధ్యమాల ద్వారా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు నిర్వహించడం, ప్రచురించడకూడదని ఈసీ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఎగ్జిట్ పోల్ సర్వేలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశమున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
నవంబర్లో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనుండగా.. నవంబర్ 7న మిజోరం, నవంబర్ 7, 17న చత్తీస్ఘడ్, నవంబర్ 17న మధ్యప్రదేశ్, నవంబర్ 25న రాజస్థాన్, తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచే ఈ రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.