Etela Rajender : ఆ ఎన్నికల్లో ఇతర పార్టీలకు బీజేపీ వణుకు పుట్టించడం ఖాయం : ఈటల
X
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని ఇతర పార్టీలకు బీజేపీ వణుకు పుట్టించడం ఖాయమని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆ ఎన్నికల్లో తమ పార్టీ 8 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ పట్టణంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేతే ప్రజలు, ధర్మం, న్యాయం గెలిచేవని.. కానీ అలా జరగలేదని ఆరోపించారు. గజ్వేల్లో గతంలో బీజేపీకి 1400 ఓట్లు మాత్రమే వచ్చాయని.. కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో వందలమంది కార్యకర్తలు ఉన్నారని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించినవని.. పార్లమెంట్ ఎన్నికలు నరేంద్ర మోదీకి సంబంధించినవని ఈటల అన్నారు. ఏ పథకాన్ని మోదీ తన క్రెడిట్‌లో వేసుకోలేదని.. ప్రభుత్వం ఇస్తోందని మాత్రమే ప్రధాని ఎప్పుడూ చెబుతారని గుర్తు చేశారు. కానీ తెలంగాణలో మాత్రం ఏ పథకమైనా తానే ఇస్తున్నట్లు కేసీఆర్ చెప్పుకునేవారని విమర్శించారు. కేసీఆర్ ఏమైనా ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నాడా అని ఎన్నోసార్లు ప్రశ్నించామన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతే అన్నీ స్కీములు ఆగిపోతాయని ప్రజలను బీఆర్ఎస్ నేతలు భయాందోళనకు గురిచేశారని ఆరోపించారు.