TS Assembly Elections 2023 : బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కీలక నేత..
X
మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోక ఆహ్వానించారు. ఎర్రశేఖర్ చేరికతో పాలమూరులో బీఆర్ఎస్ మరింత బలోపేతమవుతుందని కేటీఆర్ అన్నారు. ఇక ఉద్యమ కాలం నుంచి కేసీఆర్తో మంచి అనుబంధం ఉందని ఎర్ర శేఖర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో ముదిరాజుల జీవితాల్లో నిండాయన్నారు.
కాగా ఎర్ర శేఖర్ జడ్చర్ల కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం ఆ స్థానంలో అనిరుథ్ రెడ్డిని బరిలోకి దింపింది. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ రెబల్గా పోటీచేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ఆయన్ని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించడంతో ఎర్ర శేఖర్ గులాబీ గూటికి చేరారు. ఆయన గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చివరిసారిగా 2009లో టీడీపీ మహాకూటమి తరుపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.