Home > తెలంగాణ > Telangana Elections 2023 > KTR : గవర్నర్ ప్రసంగం పాత చింతకాయ పచ్చడిలా ఉంటుంది - కేటీఆర్

KTR : గవర్నర్ ప్రసంగం పాత చింతకాయ పచ్చడిలా ఉంటుంది - కేటీఆర్

KTR : గవర్నర్ ప్రసంగం పాత చింతకాయ పచ్చడిలా ఉంటుంది - కేటీఆర్
X

కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్ట మోసం చేసిందని మండిప్డడారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన ప్రతీ మాటకు రికార్డ్ ఉందన్న కేసీఆర్.. ఆయన్ను తామెందుకు వదిలిపెడతామని అన్నారు.

అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తామన్న రాహుల్ గాంధీ హామీని కేటీఆర్ గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే పెన్షన్ రూ.4 వేలు, 10 రోజులు ఆగితే రూ.15వేలు రైతు భరోసా ఇస్తామన్నారని, కానీ ఇంకా ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. మొదటి కేబినెట్‌లోనే ఆరు గ్యారంటీలకు చట్ట బద్దత కల్పిస్తామన్న ప్రకటన ఏమైందని నిలదీశారు.

రుణ మాఫీ చేసేందుకు ఎంత ఇబ్బంది పడ్డామో తమకు తెలుసన్న కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలా చేస్తుందో తాము కూడా చూస్తామని అన్నారు. ఎవరైనా అధికారంలోకి రాక ముందు ఆదాయ లెక్కలు చూసుకుంటారని.. కానీ వీళ్లు మాత్రం ఇప్పుడు లెక్కలు చూసుకుంటున్నారన్నారు. లెక్కలు వేసుకుని హామీలు ఇస్తారా.. లేక హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు. తాము చేసిన ప్రతీ అప్పుకు ఆడిట్ రిపోర్ట్ ఉందని స్పష్టం చేశారు. వారు చూసుకోకపోతే తమకేం సంబంధమని కేటీఆర్ అన్నారు. తాము ఏటా పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశామని అన్నారు. రేపు గవర్నర్ ప్రసంగంలో అదే పాత చింతకాయ పచ్చడి గురించి ఉంటుందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి కాంగ్రెస్కు అప్పజెప్పారని తమిళిసై చెబుతారని కేటీఆర్ విమర్శించారు.




Updated : 13 Dec 2023 1:27 PM IST
Tags:    
Next Story
Share it
Top