Gaddam Vinod : ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతి.. వినోద్పై ఆరోపణలు
X
ఎన్నికలు సమీపిస్తున్న వేల రాష్ట్రంలో ఐటీ, ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరోసారి బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ మంత్రి జి. వినోద్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. రెండ్రోజుల క్రితం ఆయన సోదరుడు, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ కంపెనీ ఖాతాల్లోకి రూ. 8కోట్ల లావాదేవీలను గుర్తించి ఫ్రీజ్ చేశారు. మరోవైపు వివేక్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని బిఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇవాళ మరోసారి వినోద్ ఇంట్లీ ఈడీ దాడులు నిర్వహించింది. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతి జరిగిందని వినోద్ పై ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న వినోద్ అవినీతికి పాల్పడ్డారనే నేపథ్యంలో ఆయన ఇంటిపై ఈడీ మరోసారి దాడిచేసింది. గతంలో మూడు చార్జిషీట్లు దాఖలు చేసిన తెలంగాణ ఏసీబీ మరోకొత్తది జోడించింది. ఏసీబీ దాఖలు చేసిన చార్జీషీట్ల ఆధారంగా ఈడీ అధికారుల తనిఖీలు చేశారు. వినోద్ సహా మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అయూబ్ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిపింది. ఇటీవల చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి, వినోద్ సోదరుడు వివేక్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ కావాలనే బీజేపీ, బీఆర్ఎస్ ఐటీ దాడులు చేయిస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.