Home > తెలంగాణ > Telangana Elections 2023 > Telangana Assembly 2023 : కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిందే టీఆర్ఎస్ : హరీష్ రావు

Telangana Assembly 2023 : కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిందే టీఆర్ఎస్ : హరీష్ రావు

Telangana Assembly  2023   : కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిందే టీఆర్ఎస్ : హరీష్ రావు
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. సీఎం సభను తప్పుదోవ పట్టించారని అన్నారు. పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్ నేతలు మాత్రమే కొట్లాడారంటూ సీఎం రేవంత్ అన్నారని.. వెంటనే ఆ రికార్డు సరిచేయాలన్నారు. పోతిరెడ్డిపాడుకు పొక్క కొట్టారనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చామని చెప్పారు.

కాంగ్రెస్ తమకు పదవులు ఇవ్వడం కాదని.. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం వల్లే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని హరీష్ రావు అన్నారు. తమతో గొంతు కలిపింది పీజేఆర్ ఒక్కరే అని మిగితా కాంగ్రెస్ నేతలు మాట్లాడలేదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఏబీవీపీలో మొదలు పెట్టి.. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు.. ఆ తరవాత ఎక్కడ ఉంటారో అని సెటైర్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు.


Updated : 16 Dec 2023 12:45 PM IST
Tags:    
Next Story
Share it
Top