Home > తెలంగాణ > Telangana Elections 2023 > TS Assembly Elections 2023 : కరువులో ఉన్న తెలంగాణను కోనసీమగా తీర్చిదిద్దారు: హరీష్ రావు

TS Assembly Elections 2023 : కరువులో ఉన్న తెలంగాణను కోనసీమగా తీర్చిదిద్దారు: హరీష్ రావు

TS Assembly Elections 2023 : కరువులో ఉన్న తెలంగాణను కోనసీమగా తీర్చిదిద్దారు: హరీష్ రావు
X

సిద్దిపేట్ జిల్లా కావాలి, గోదావరి నీళ్లు రావాలి, రైల్వే ట్రాక్ తేవాలనే ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్ దని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజల నినాదాలు, గోడమీద రాతలను నెరవేర్చిన గొప్ప నాయకులు కేసీఆర్ అని కొనియాడారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన హరీష్ రావు.. కేసీఆర్ కారణ జన్ముడని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికే పుట్టాడని చెప్పుకొచ్చారు.

మాజీ రాష్ట్రపతి ప్రనభ్ ముఖర్జి అన్నట్లు.. కేసీఆర్ ఓ కారణ జన్ముడు. తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించాలని కలలు కని, కొట్లాడి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. అంతేకాకుండా సాధించిన రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లు తీర్చిదిద్దిన నేత కేసీఆర్ అని కోనియాడారు. కేసీఆర్.. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వారిని ఒప్పించి, మెప్పించి.. సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ వరకు రైలు మార్గానికి అనుమతి తీసుకొచ్చారని హరీష్ వివరించారు. కానీ, అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రైలు మార్గానికి అనుమతులు, నిధులు ఇవ్వకుండా, భూసేకరణ చేయకుండా అడ్డుపడిందని ఆరోపించారు. కేసీఆర్ సీఎం అయిన వెంటనే రూ. 630 కోట్లు మంజూరు చేసి, బుల్లెట్ స్పీడ్ లో ఈ రైలు మార్గాన్ని పూర్తిచేశారని చెప్పారు.

3 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తిచేసి, ఆ నీళ్లను సిద్దిపేటకు అందించిన ఘనత కేసీఆర్ దని అన్నారు. ఇక్కడి ప్రజలను కరువు నుంచి కాపాడి, భూములను సస్యశ్యామలం చేసింది కేసీఆర్. వరి ఎగుమతుల్లో తెలంగాణను మొదటి స్థానంలో నిలిపిన ఘనుడు కేసీఆర్ అని హరీష్ రావు చెప్పుకొచ్చారు. కరువులో ఉన్న తెలంగాణను కోనసీమగా తీర్చిదిద్దారు. ఎకరానికి నాలుగు లక్షలు కూడా రాని భూముల ధరలను.. ఆకాశానికి ఎత్తారు. రైతుల గౌరవాన్ని పెంచారు. ఈ రాష్ట్రం రైతు నాయకుడి చేతిలో ఉంది గనుక.. రైతులంతా ధైర్యంగా ఉన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి అందరికీ కొండంత అండగా నిలిచారు కేసీఆర్. 11సార్లు చాన్స్ ఇచ్చినా కాంగ్రెస్ కు సాధ్యం కాని అభివృద్ధిని కేసీఆర్.. 9 ఏళ్లలో చేసి చూపించారని చెప్పుకొచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి.. మళ్లీ ప్రజల ఆశీర్వాదం కోసం బయలుదేరిన కేసీఆర్ ను ఆశీర్వదించాలని కోరారు హరీష్ రావు.

Updated : 17 Oct 2023 6:42 PM IST
Tags:    
Next Story
Share it
Top