Home > తెలంగాణ > Telangana Elections 2023 > Harish Rao : కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరి విపక్ష పాత్ర పోషించేదెవరు..?

Harish Rao : కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరి విపక్ష పాత్ర పోషించేదెవరు..?

Harish Rao  : కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరి విపక్ష పాత్ర పోషించేదెవరు..?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. కాంగ్రెస్ పార్టీకి జనం అధికారం కట్టబెట్టారు. ఇవాళ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే విపక్ష నేతగా ఎవరుంటారన్నది ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారింది. పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తారా లేదా అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తాజా పరిణామాలు గమనిస్తే... కేసీఆర్ విపక్ష నేతగా ఉండకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావుకు విపక్ష నేత బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. పార్టీలో అందరితో ఆయనకు సత్సంబంధాలున్నాయి. మరోవైపు కొడుకు కేటీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండటంతో విపక్ష నేత హోదాను అల్లుడికి అప్పగించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

పదేండ్ల తర్వాత అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు భవిష్యత్తులో అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీని తట్టుకొని పార్టీని మళ్లీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ ఒత్తిళ్లతో పాటు లోక్ సభ, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నుకను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ దిశానిర్దేశంలో కేటీఆర్ - హరీశ్ రావు బీఆర్ఎస్ను ముందుకు నడిపేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.




Updated : 4 Dec 2023 12:18 PM IST
Tags:    
Next Story
Share it
Top