Harish Rao : మల్కాజిగిరిని దత్తత తీసుకుంటా: హరీశ్ రావు
X
మంత్రి హరీష్ రావు మైనంపల్లి హనుమంతరావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుతో మైనంపల్లి డబ్బును మైనంలా కరిగించాలన్నారు. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన ప్రచార సభలో పాల్గొన్న హరీశ్ రావు.. మైనంపల్లిపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. నగరానికి మల్కాజ్ గిరి సెగ్మెంట్ గుండెకాయ లాంటిదని చెప్పుకొచ్చారు. మైనంపల్లిలా తాను దిగజారి మాట్లాడలేనని, ఓటర్లు తమ ఓటు హక్కుతో మైనంపల్లికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
బీఆర్ఎస్ అభ్యర్తి మర్రి రాజశేఖరరెడ్డి కోరితే మల్కాజ్ గిరిని దత్తత తీసుకుంటానని చెప్పారు. కాలుష్యం తక్కువున్న నగరంగా హైదరాబాద్ కు గ్లోబల్ అవార్డులు వస్తుంటే.. తమను విమర్శించడం సరికాదన్నారు. రాజశేఖర రెడ్డి చేతిలో మైనంపల్లి ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తర్వాత.. స్టేజ్ ఏదైనా హరీష్ రావు, మల్లారెడ్డిలపై మైనంపల్లి విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తీవ్ర విమర్శలు చేస్తూ రచ్చలేపుతున్నాడు. తన కుమారుడికి బీఆర్ఎస్ మెదక్ టికెట్ రాకపోవడానికి కారణం హరీష్ రావని.. తరచూ ఆయన్ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే.