Home > తెలంగాణ > Telangana Elections 2023 > Amit Shah : ఇవాళ తెలంగాణకు అమిత్ షా.. ఆదిలాబాద్లో..

Amit Shah : ఇవాళ తెలంగాణకు అమిత్ షా.. ఆదిలాబాద్లో..

Amit Shah : ఇవాళ తెలంగాణకు అమిత్ షా.. ఆదిలాబాద్లో..
X

తెలంగాణలో 50 రోజుల్లో ఎన్నికలు జరగనుండడంతో బీజేపీ స్పీడ్ పెంచింది. వరుస బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్తోంది. ఈ నెల 1న మహబూబ్ నగర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. దానికి కొనసాగింపుగా 3న నిజామాబాద్లో బీజేపీ సభ నిర్వహించగా.. తాజాగా ఆదిలాబాద్లో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఆదిలాబాద్ డైట్ కాలేజీ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

ఆదిలాబాద్ సభ అనంతరం సాయంత్రం శంషాబాద్ లోనూ బీజేపీ మరో సభ నిర్వహించాలని తొలుత భావించింది. అయితే అది రద్దుకావడంతో సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్లో నిర్వహించే మేధావుల సభలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం రాత్రి బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమై రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.

అమిత్‌ షా షెడ్యూల్‌:

అమిత్ షా మధ్యాహ్నం 1.45 కు బేగంపేట ఎయిర్పోర్ట్‌కు చేరుకుంటారు.

మ. 2.35కు ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్కు బయలుదేరుతారు

మ. 3 నుంచి 4 గంటల వరకు ఆదిలాబాద్ సభలో పాల్గొంటారు.

మ. 4.15 కు ఆదిలాబాద్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు.

సా. 5.05 బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

సా. 5. 20 నుంచి 6 గంటల వరకు ఐటీసీ కాకతీయలో సమావేశం

సా. 6 గంటలకు ఇంపీరియల్ గార్డెన్‌కు బయల్దేరనున్న హోం మంత్రి

సా. 6.20 నుంచి 7.20 వరకు ఇంపీరియల్ గార్డెన్‌లో మేధావులతో భేటీ

రాత్రి 7.40 గంటలకు ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం

రాత్రి 9.40 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీకి తిరుగు పయనం


Updated : 10 Oct 2023 2:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top