Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR : ప్రధాని ముందు నోరు మెదపని ఎంపీలు ఎందుకు..? - సీఎం కేసీఆర్

KCR : ప్రధాని ముందు నోరు మెదపని ఎంపీలు ఎందుకు..? - సీఎం కేసీఆర్

KCR : ప్రధాని ముందు నోరు మెదపని ఎంపీలు ఎందుకు..? - సీఎం కేసీఆర్
X

ప్రధాని మోడీ ఎదుట నోరు మెదపని బీజేపీ ఎంపీలు ఉండి ఏం లాభమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అలాంటి ఎంపీల స్థానంలో వేరే వాళ్లు గెలిచినా బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బోథ్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చి పదేండ్లు వచ్చినా తెలంగాణ కోసం చేసిందేమీలేదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 10ఏండ్లలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే.. అందులో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకో నవోదయ పాఠశాల కేటాయించాలని నిబంధనలు చెబుతున్నా కేసీఆర్ సర్కారు పట్టించుకోలేదని కేసీఆర్ విమర్శించారు. అందుకే బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దని పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రజలను 58 ఏండ్లు అరిగోస పెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే విషయంలో 15 ఏండ్లు మోసం చేసిందని కేసీఆర్ ఫైర్ అయ్యారు. 1969లో 400 మందిని కాల్చి చంపిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పై ఉప్పెనలా ఉరిమితే తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. నీళ్లు, కరెంటు కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పడ్డ గోస అంతా ఇంతా కాదన్న కేసీఆర్.. ఒకప్పుడు మంచం పట్టిన మన్యం అని నిత్యం వార్తల్లో వచ్చేదని గుర్తు చేశారు. ప్రస్తుతం 24 గంటల నాణ్యమైన కరెంటుతో పాటు ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తున్నామని చెప్పారు.

రైతుల సంక్షేమం కోసం తెచ్చిన ధరణి పోర్టల్ను తీసేస్తామని కాంగ్రెస్ అంటోందని అలా జరిగితే దళారీలు, పైరవీకారుల రాజ్యం వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో బోథ్లో 10వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చినట్లు చెప్పారు. బీఆర్ఎస్ను మళ్లీ గెలిపిస్తే నెల రోజుల్లో బోథ్ను రెవెన్యూ డివిజన్ చేయడంతో పాటు డిగ్రీ కాలేజీ, కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.




Updated : 16 Nov 2023 4:05 PM IST
Tags:    
Next Story
Share it
Top