Home > తెలంగాణ > Telangana Elections 2023 > Ponguleti Srinivas Reddy : సంక్రాంతిలోపు ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభిస్తాం.. మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy : సంక్రాంతిలోపు ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభిస్తాం.. మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy : సంక్రాంతిలోపు ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభిస్తాం.. మంత్రి పొంగులేటి
X

వచ్చే సంక్రాంతి పండుగ లోపు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యం లో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటామని, ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటామని , కుటుంబాలలో సభ్యునిగా ఉంటూ.. ఇందిరమ్మ పరిపాలన నిదర్శనంగా తీర్పు ఇచ్చిన ప్రజలకు పరిపాలన అందిస్తామని అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన వేముల వీరేశం విజయోత్సవ ర్యాలీని ఆదివారం నకిరేకల్ పట్టణంలో నిర్వహించారు. నకిరేకల్‌ బైపాస్‌ పద్మానగర్‌ జంక్షన్‌ నుంచి నకిరేకల్‌ మెయిన్‌ సెంటర్‌ ఇందిరాగాంధీ సెంటర్‌ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లో అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని,ఇందిరమ్మ రాజ్యం లో ప్రజల ఆశలు,ఆలోచనల కనుగుణంగా అద్భుత పరిపాలన అందిస్తామని,ప్రతి నిమిషాన్ని ప్రజల మంచి కోసం వినియోగిస్తామని అన్నారు. నకిరేకల్‌ ఎమ్మెల్యేగా వేముల వీరేశాన్ని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ స్కీముల్లో ఇప్పటికే 2 గ్యారంటీలను అందిస్తున్నట్లు చెప్పారు. సంక్రాంతి లోపు గృహ నిర్మాణ పాలసీ రూపొందించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం ప్రారంభిస్తామని ఆయన అన్నారు. రాబోయే 15 రోజుల్లో డ్రగ్స్ మాఫియా ను తెలంగాణ రాష్ట్రం నుంచి పారద్రోలే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని అన్నారు.

ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా నకిరేకల్‌ పట్టణ రోడ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇళ్లులేని వారందరికీ ఇళ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, రాష్ట్ర శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




Updated : 18 Dec 2023 2:08 AM GMT
Tags:    
Next Story
Share it
Top