Jana Reddy : మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో ఐటీ రైడ్స్
X
సెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ) రైడ్స్ సంచలనం రేపుతున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు.. రెండవ రోజు కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుండే అధికారులు ముమ్మరంగా సోదాలు మొదలుపెట్టారు శుక్రవారం నాడు ఐటీ అధికారులు మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిన్నటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విస్పర్ వ్యాలీ విల్లాలోని రఘువీర్ రెడ్డి నివాసంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. జానారెడ్డి మరో తనయుడు జయవీర్‌కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు దక్కింది. నాగార్జునసాగర్ నుండి జయవీర్ బరిలో నిలిచారు. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుండి రఘువీర్ టిక్కెట్టు కోసం ధరఖాస్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ నేతలకు చెందిన 18 చోట్ల ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, నిన్న ఉదయం నుంచి బడంగ్ పేటకు చెందిన కాంగ్రెస్ నేతలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పారిజాత లక్ష్మీనరసింహారెడ్డి నివాసాల్లో ఇన్‌కంటాక్స్ అధికారులు సోదాలు ముగిశాయి. కాంగ్రెస్ నేతల ఇంటి నుంచి ఐటీ అధికారులు తెల్లవారుజామున వెళ్లిపోయారు.
బడంగ్ పేటలోని కాంగ్రెస్ నేతలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పారిజాత లక్ష్మీనరసింహారెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించేందుకు ఐటీ అధికారులు వచ్చిన సమయంలో నిన్న ఉదయం నుంచి పారిజాత ఇంట్లో లేదు. ఆమె తిరుపతిలో ఉంది. ఆమె భర్త నరసింహారెడ్డి న్యూఢిల్లీలో ఉన్నారు. తిరుపతి నుంచి చెన్నై మీదుగా నిన్న రాత్రి పారిజాతాన్ని ఐటీ అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈరోజు ఉదయం ఆరున్నర గంటల వరకు ఐటీ సోదాలు జరిగాయి. పారిజాత హైదరాబాద్ రాగానే ఆమె భర్త నరసింహారెడ్డి కూడా న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. పారిజాత నరసింహారెడ్డి ఆదాయం, వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీశారు. ఐటీ అధికారుల ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు పారిజాత నరసింహారెడ్డి మీడియాకు తెలిపారు.