Home > తెలంగాణ > Telangana Elections 2023 > Ka Paul : తెలంగాణ సీఈవో కేసీఆర్కు అమ్ముడుపోయిండు : కేఏ పాల్

Ka Paul : తెలంగాణ సీఈవో కేసీఆర్కు అమ్ముడుపోయిండు : కేఏ పాల్

Ka Paul   : తెలంగాణ సీఈవో కేసీఆర్కు అమ్ముడుపోయిండు : కేఏ పాల్
X

ఎలక్షన్ కమిషన్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కేసీఆర్కు అమ్ముడుపోయాడని ఆరోపించారు. పోలింగ్ ముగిసిన తర్వాత తుంగతుర్తిలో ఈవీఎంలు మిస్ అయ్యాయని.. 30 స్థానాల్లో ఈవీఎంలు కన్పించడలేదని అన్నారు. సీఈవో వికాస్ రాజ్పై చీఫ్ జస్టిస్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులతో కేసీఆర్, కేటీఆర్ మాట్లాడుతున్నారని.. వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నా..ఈసీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ నెల 4న కేసీఆర్ కేబినెట్ మీటింగ్ ఎలా పెడతారని అడిగారు. ఇక పోలింగ్ సమయంలో హైదరాబాద్ ప్రజలు తన మాట విన్నారని.. 40శాతం మంది మాత్రమే ఓటేశారని అన్నారు. ఎన్నికలు కోడ్ అమల్లో ఉన్నప్పుడు రైతు బంధుకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.


Updated : 2 Dec 2023 3:43 PM IST
Tags:    
Next Story
Share it
Top