KA Paul : సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని స్వర్గంలా మారుస్తా - కేఏ పాల్
X
కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందదని ప్రజలందరికీ అర్థమైందని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని స్వర్గంలా మారుస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తుకారాంగేట్ లోని మాంగర్ బస్తీలో పర్యటించిన ఆయన ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మేనిఫెస్టోలో అది చేస్తాం.. ఇది చేస్తామంటున్న కేసీఆర్.. ఇన్నాళ్లు బస్తీలో కనీస సౌకర్యాలు, డ్రైనేజీ కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ తమ మేనిఫెస్టో కాపీ కొట్టారంటున్న కాంగ్రెస్ పైనా పాల్ ఫైర్ అయ్యారు. బ్రిటిష్ వారి కన్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే ఈ దేశాన్ని సర్వనాశనం చేశాయని విమర్శించారు.
కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకోని కనీసం పించన్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని పాల్ అభిప్రాయపడ్డారు. మేనిఫెస్టోలో పింఛన్లు, రైతు బంధు పెంచుతామన్న బీఆర్ఎస్ ఇప్పుడున్న పెన్షన్లు సరిగా ఇస్తే చాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణను రియల్ బంగారు తెలంగాణగా మారుస్తానని హామీ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీ టికెట్ కావాలనుకునే వారు రూ. 10 వేల చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని పాల్ స్పష్టం చేశారు.