Home > తెలంగాణ > Telangana Elections 2023 > Ka Paul : నా మాట విని ఓటేయకుండా ఇంట్లో ఉన్నందుకు థాంక్యూ : కేఏ పాల్

Ka Paul : నా మాట విని ఓటేయకుండా ఇంట్లో ఉన్నందుకు థాంక్యూ : కేఏ పాల్

Ka Paul : నా మాట విని ఓటేయకుండా ఇంట్లో ఉన్నందుకు థాంక్యూ : కేఏ పాల్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.68శాతం పోలింగ్ నమోదైంది. ప్రజలు సహా పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన ఓటుహక్కు వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. తన మాట విని ఎవరు ఓటు వెయ్యడానికి రానందుకు థాంక్యూ అంటూ పాల్ అన్నారు. పైగా తాను నోటాకు ఓటేసినట్లు తెలిపారు.

‘‘ప్రజాశాంతి పార్టీ యాక్టివ్లో లేదు. కేవలం ఐదుగురు అభ్యర్థులకు మాత్రమే ఈసీ గుర్తులను కేటాయించింది. దీనిపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. అందుకే ఓట్లు వేయకండి.. ఇంట్లోనే ఉండండి అని పిలుపునిచ్చాను. నేను కూడా ఏ అభ్యర్థికి ఓటు వేయలేదు. అందరు అవినీతి పరులే. అందుకే నోటాకు ఓటేశాను. నేను చెప్పినట్లుగానే ఓటర్లు కూడా ఓటువేసేందుకు రాలేదు. ఓటు వేయకుండా మంచిపనిచేశారు. అందుకే అందరికీ థాంక్యూ. ఒకవేళ ఓటు వేయాలనుకుంటే నోటాకు వేయండి’’ అని పాల్ అన్నారు.


Updated : 30 Nov 2023 10:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top