Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR : సాధారణ నేతగా కేసీఆర్.. సీఎం పదవికి రాజీనామా

KCR : సాధారణ నేతగా కేసీఆర్.. సీఎం పదవికి రాజీనామా

KCR : సాధారణ నేతగా కేసీఆర్.. సీఎం పదవికి రాజీనామా
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమైంది. దాంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ముఖ్మమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖను ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసైకి పంపారు. అనంతరం ప్రగతిభవన్ నుంచి తన సొంత కారులో, అధికార సెక్యూరిటీ (సొంత సెక్యూరిటీతో) లేకుండా ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. తొమ్మిది సంవత్సరాలకుపైగా సీఎం పదవిలో ఉండి సేవలందించిన కేసీఆర్ పదవికాలం.. ఈ రోజుతో ముగిసింది. కాగా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ దాటింది. 64కు పైగా స్థానాల్లో దాదాపు గెలుపొందింది. ఇక ఈసారి గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్.. గజ్వేల్ లో గెలిచి, కామారెడ్డిలో ఓడిపోయారు.




Updated : 3 Dec 2023 12:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top