KCR : కేసీఆర్ బిజీ షెడ్యూల్.. ఇవాళ 4 చోట్ల కేసీఆర్ బహిరంగ సభలు
X
బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఆదివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ఇవాళ ఒక రోజే నాలుగు చోట్ల సభలు ఉన్నందున సీఎం షెడ్యూల్ పూర్తి బిజీగా మారింది. సభల్లో పాల్గొనేందుకు మధ్యాహ్నం 12: 40 గంటలకు ప్రగతిభవన్ నుంచి కేసీఆర్ బయలుదేరుతారు. కేసీఆర్ బహిరంగ సభల కోసం పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవరకద్ర అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గద్వాలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మక్తల్ లో చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట్ లో రాజేందర్ రెడ్డి సభలను నిర్వహించనున్నారు.
సీఎం రాక సందర్భంగా మహబూబ్ నగర్ నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ గులాబీమయమయ్యాయి. సభ ఏర్పాట్లను ఇప్పటికే రాష్ట్ర నాయకులు పర్యవేక్షించారు. సీఎం పర్యటన సందర్భంగా ఆయా నియోజకవర్గ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు. హెలిప్యాడ్‌లను సిద్ధం చేసి.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. కాగా, ఆశీర్వాద సభలకు నాలుగు నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.