Home > తెలంగాణ > Telangana Elections 2023 > Kishan Reddy : రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై కిషన్ రెడ్డి కామెంట్స్

Kishan Reddy : రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై కిషన్ రెడ్డి కామెంట్స్

Kishan Reddy : రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై కిషన్ రెడ్డి కామెంట్స్
X

బీజేపీకి రాజీనామా చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. త్వరలోనే కాంగ్రెస్​లో చేరబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో తెలంగాణలో బీఆర్ఎస్​కు గట్టి పోటీనిచ్చే సత్తా కాంగ్రెస్​కు మాత్రమే ఉందని.. బీజేపీ డీలా పడిందని ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం తీవ్రంగా ఫైర్ అయ్యారు. పార్టీ మారడం అనేది వ్యక్తులపై ఆధారపడుతుందని.. ఎవరిష్టం వారిదని.. ఎవరి ఆలోచనలు వారివని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ మంచి అవకాశం ఇచ్చిందని, జాతీయ స్థాయిలో పదవి కట్టబెట్టామని కిషన్ రెడ్డి చెప్పారు

బీఆర్ఎస్​కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదని ఆయన అనుకున్నంత మాత్రాన పోటీ కాకుండా పోతుందా అని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టేది తామేనని కిషన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం తప్పని ఖండించారు.

మరోవైపు జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో పార్టీలో చేరిన నాయకుడు.. ఇప్పుడు నిందలు వేయడం సరికాదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. వ్యక్తిగతంగా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. రాజగోపాల్ రెడ్డిని పాసింగ్ క్లౌడ్ అని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. పార్టీ ఎప్పుడు బలంగా ఉంటుంది … కొందరు అలా వచ్చి ఇలా వెళ్తారని చెప్పారు. తాను ఎంపీగానే పోటీ చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.




Updated : 25 Oct 2023 1:55 PM IST
Tags:    
Next Story
Share it
Top